Friday, June 5, 2026
HomeAndhra Pradeshలోతట్టు గ్రామంలో 104 ప్రభుత్వ సంచార వైద్య సేవలు పాల్గొన్న డాక్టర్: పావని

లోతట్టు గ్రామంలో 104 ప్రభుత్వ సంచార వైద్య సేవలు పాల్గొన్న డాక్టర్: పావని

పోలవరం,జిల్లావాణి ప్రతినిధి: ఎండ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న రీత్యా గాల్పులు సమయంలో తిరిగి వడదెబ్బకు ఎవ్వరూ గురికాకుండా జాగ్రత్తలను పాటించాలని జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పావని ప్రజలకు సూచించారు. గురువారం కొండలింగంపర్తి, కరుదేవపాలెం గ్రామంలో 104 ప్రభుత్వ సంచార వైద్య సేవలను నిర్వహించారు. 40 మందికి వైద్య పరీక్షలను చేసి మందులను ఇచ్చారు. గర్భిణీ లు ప్రసవ సమయానికి ముందే పి. హెచ్. సి కి చేరి వైద్యసేవలను పొందాలని అన్నారు. ఎక్కువగా నీటిని తీసుకొని, సకాలంలో భోజనం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డా. పావని, హెచ్. వి. భూముల వెంకటరమణ, యం. ఎల్. హెచ్. పి. మురళీ, హెల్త్ అసిస్టెంట్ కోండ్ల రాజబాబు, ఏ. ఎన్. యం. సుజాత, 104 డి. ఈ. ఓ శ్రీనివాస్, పైలట్ శివకనకరాజు, ఆశలు సుమ్మర్ల లక్ష్మి, కాళ్ళ పార్వతి, కాంతం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular