Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఅంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీటీసీ వంశి

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీటీసీ వంశి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతి ఈతలపాడు అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక ముసురుమిల్లి ఎంపీటీసీ కుంజం వంశీ సందర్శించారు. అంగన్వాడీకి రోజువారీ వస్తున్న పిల్లల హాజరుపట్టికను పరిశీలించారు. నేడు అంగన్వాడీ కేంద్రనికి హాజరుకానీ పిల్లలు దేనినిమిత్తం హాజరు కాలేదు దానికి గలకారణాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడుతూ పిల్లలు ఎవరైనా ఆరోగ్య రిత్యా బాగోలేక అంగన్వాడీకి హాజరుకాకపోతే వెంటనే గ్రామంలో ఉన్న ఆశ కార్యకర్త కి , ఏఎన్ ఏం సమాచారం ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ కి ఎంపీటీసీ సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నస్టాక్ పరిశీలించా రు. రానున్న కాలం వేసివి దృష్ట్యా పిల్లలకి,బాలలింతలాకు పలు జాగ్రత్తలు సూచనలు ఇవ్వాల్ని తెలిపారు. ఈతలపాడు, తామరపల్లి అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు పనులను పరిశీలించి, సకాలం లో పూర్తి చేసి అంగన్వాడీ సిబ్బందికి అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సచివాలయ ఇంచార్జి మహిళా పోలీస్ కృష్ణవేణి, ఇంచార్జి ఇంజనీరింగ్ అసిస్టెంట్ రోషిణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular