Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరాజకీయం వైపు మలుపు తిరిగిన ఊర్లకులపాడు ఉద్దానం ఘటన

రాజకీయం వైపు మలుపు తిరిగిన ఊర్లకులపాడు ఉద్దానం ఘటన

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం లోని ఊర్లకులపాడు గ్రామంలో వరుస మరణాల ఘటనలు చోటుచేసుకొంట్టున నేపథ్యంలో అదికాస్తా రాజకీయం వైపు పులుపుకొంది. ఈక్రమంలోనే అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మద్య రాజకీయ మాటల తూటాల చేసుకొంటున్నారు. ఈసందర్భం గానే తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మపై మారేడుబాక గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ తొంటా ఆదిరాజు పార్టీలు మార్చే మీరు ప్రజాసంక్షేమం కోసం మాట్లాడే అర్హత వుందో లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మీ మాతృ పార్టీ, తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలో చేసిన మీరు విశ్వనీయత కోసం మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార వ్యామోహం కోసం జెండాలు మార్చడం మాకు చేతకాదన్నారు. జడ్పీటీసీగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీకి మీరు చేసిందేమీ లేదనీ ఎద్దేవ చేశారు. ఆయన వెంటా మంప నరసింహం కూడా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular