Friday, June 5, 2026
HomeAndhra Pradeshసర్పంచ్ ల పదవి కాలం పూర్తి కావడంతో మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీ ప్రత్యేక...

సర్పంచ్ ల పదవి కాలం పూర్తి కావడంతో మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియామకం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇప్పటివరకు గ్రామపంచాయతీలలో సర్పంచులుగా ఎన్నుకోబడినవారు 5 సంవత్సరాల పదవీకాలం 2026 ఏప్రిల్ 2 నాటికి ముగియడంతో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ లుగా ఉన్న వారు సర్పంచ్ హోదాను పూర్తిగా కోల్పోవడంతో నేటి నుండి వారు మాజీ సర్పంచ్ లుగా పిలువబడతారు. ఇది ఇలా ఉండగా ఇక నుంచి గ్రామ స్థాయిలోని ఏ సమస్య ఉన్న గ్రామ స్థాయిలోని పరిపాలన పరంగా ప్రత్యేక అధికారులుగా మండలం స్థాయి అధికారులుగా పలు శాఖలలో విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, విద్య శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయితీరాజ్ , ఐసీడీఎస్ వంటి కీలకమైన శాఖలకు చెందిన మండల అధికారులను నియమించింది. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలోని 19 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఏయే గ్రామపంచాయతీలకు ఎవరిని నియమించారో ఈ క్రింద ధ్రువీకరించడం జరిగింది. కిండ్ర, లాగరాయి పంచాయితీలకు తహసీల్దార్ అల్లు ఎస్వి సత్యనారాయణ, రాజవొ మ్మంగి, తంటికొండ పంచాయతీలకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి లోకుల.యాదగిరేశ్వర రావు, గడుఒకుర్తి పంచాయతీ కు మండల విద్యాశాఖాధికారి కె.వి.వి. సత్యనారాయణ దొర, అమీనాబాద్, చెరుకుంపాలెం, చికిలింత, వంచంగి పంచాయతీ లకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జి.సీతారామయ్య, బడదనాంపల్లి పంచాయతీకి డిప్యూటీ ఎంపీడీవో ఎం.పైడిరాజు, జడ్డంగి, దూసరిపాము,కొండపల్లి, శరభవరం పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో పంచాయతీరాజ్ బి.విజయకుమార్, కిర్రాబు పంచాయతీకి సిడిపిఓ , డి.సుజాత, లబ్బర్తి పంచాయతీకి మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ పి.చక్రధర్, లోదొడ్డి, మారేడుబాక,వాతంగి పంచాయతీలకు పంచాయతీరాజ్ ఏఈ సి .హెచ్.రవితేజ ను నియమించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular