పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని ఏబి కాలనీలోని స్థానిక పాఠశాలలో కర్రి నందిని (7)వ తరగతి చదువుతున్న బాలిక తీవ్ర అశస్వతకు గురై వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయింది. బాలికను ఉపాధ్యాయులు ఎవరు పట్టించుకోకపోవడంతో అది గమనించిన అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్ధిని సోదరుడు పరుగు పరుగున ఇంటికి వెళ్లి తండ్రి కర్రి చక్రధర్ కి విషయం తెలపడంతో పాఠశాల వద్దకు పరుగు పరుగున వచ్చిన తండ్రి దీనస్థితిలో కింద పడిపోయి ఉన్నా కూతురు నందిని చూసి వెంటనే అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా అక్కడ ఉన్న స్థానిక వైద్య సిబ్బంది వైద్య సేవలను అందించి అక్కడ నుంచి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం అడ్డతీగల ఆసుపత్రికి తల్లిదండ్రు లను తీసుకెళ్లామని చెప్పగా వారు అడ్డతీగల తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని శిలైన్స్ ఎక్కిస్తున్నారని తండ్రి తెలియజేశారు. ఇదిలా ఉండగా తన కూతురు కళ్ళు తిరిగి వాంతులు చేసుకొని పడిపోయినప్పటికీ స్థానిక సిబ్బంది ఉపాధ్యాయులు ఎవరు పట్టించుకోలేదని తండ్రి చక్రధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు దీనిపై వివరణ చేసి ఉపాధ్యాయుల వ్యవహరించిన తీరుపై తగు చర్యలు ఆయన కోరుతున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలింపు
RELATED ARTICLES
