Thursday, April 16, 2026
HomeAndhra Pradeshలోతట్టు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మిరియాల, రాజముద్రతో ఉన్న ప్రభుత్వ భూ పట్టాల...

లోతట్టు గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మిరియాల, రాజముద్రతో ఉన్న ప్రభుత్వ భూ పట్టాల పంపిణీ చేసిన శిరీష దేవి.

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్నల భూ-ఆస్తుల పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తుందని ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం లోతట్టు ప్రాంతమైన పాకవెల్తి గ్రామంలో శనివారం మీ భూమి- మీ హక్కు అనే కార్యక్రమాన్ని రాజవొమ్మంగి మండల రెవెన్యూ తహసిల్దార్ అల్లు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమ సమావేశంలో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు పై అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటోతో ఉన్న భూ పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వడంపై ఎమ్మెల్యే శిరీష ఎద్దేవా చేశారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఆస్తి రైతులది అయితే వారి భూ హక్కు పత్రాలపై మాత్రం మాత్రం జగన్ ఫోటో పెట్టుకోవటం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతన్నల ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా చేయాలన్న సదుద్ధేశముతో రీ -సర్వే చేసి ఆయా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు ఆయా భూములపై పూర్తి హక్కు పత్రాలు వారికే చెందేలా ప్రభుత్వ రాజముద్ర తో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతర ఆమె చేతులు మీదుగా 34 మంది రైతులకు ఈ-పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకంలో ఎలాంటి తప్పులు వివరాల్లో కానీ విస్తీర్ణంలో కానీ ఉన్నా సరిచేసి రెవెన్యూ అధికారులు అంద జేయాలని సూచించారు . అలాగే రీ -సర్వే కాని గ్రామాల్లో వేగవంతంగా సర్వే ప్రక్రియ పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ ఏర్పాటు చేసినట్లు దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో కలిగే ప్రయోజనాలపై వివరించారు. త్వరలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వార మంజూరు అయిన రూ;4.92 లక్షల రూపాయలతో త్రాగునీటి మరమత్తులు కోసం పనులు చేపడతామన్నారు. పూర్తి పారదర్శకంగా ఎక్కడ అవసరమో అక్కడే కూటమి శ్రేణులు దగ్గరుండి నాణ్యతతో చేయించుకోవాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారం లో అధికారుల తాత్సారం చేయొద్దు ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యల పరిష్కారం కొరకు వచ్చే ప్రజల పట్ల అధికార యంత్రాంగం పూర్తి పార దర్శకంగా ఉండాలని రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు సౌజన్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఆమె మాట్లాడుతూ ప్రతీ సమస్య ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా స్థానిక నాయకులకు తెలియ జేయాలని కోరారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే తన దృష్టిలో పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజా సమస్యలపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు తమ పరిధిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. కాని పక్షంలో ఎందుకు పరిష్కారం కాదో ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో స్పష్టంగా దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా దర్బారులో దరఖాస్తు అందించే వారు ఆధార్ కార్డు నంబర్, చరవాణి నంబర్ ఖచ్చితంగా వేయాలని సూచించారు. కొన్ని రకాల సమస్యలు విన్న ఆమె వెంటనే సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారం చేయాలని ఆదేశించారు. కొన్ని సమస్యలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన దరఖాస్తు దారుల సమస్యలు పూర్తి చేసి తనకు చెప్పాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి నిర్లక్ష ధోరణి లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు అండగా ఎప్పుడూ ఉంటాము. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన ఆదుకోవడటంలో ముందుతానని రంప చోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామాల్లో శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో అనారోగ్యoపాలైన పుప్పాల భాస్కర రావు ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి కష్టం వచ్చిన ఒక్క ఫోన్ చేయండి అని నేను అందుబాటులో లేకపోయిన మెరుగైన వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ పరంగా వ్యక్తిగతం గాను సహాయ చర్యలు చేపడతామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. తెలుగుదేశం అంటేనే ఒక కుటుంబమని ఏ ఒక్కరికి కష్టం వచ్చిన అందరమూ కలిసి ఆర్థికంగా, హార్దికంగా, ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, ఏఏంసి చైర్మన్ లోతా లక్ష్మణరావు, రాజవొమ్మంగి సొసైటీ అధ్యక్షులు ముప్పన కేశవ్, ఏఏంసి డైరెక్టర్లు గట్టి మాణిక్యం, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం శెట్టి గంగాధర్, మాజీ ఎంపీపీ రెడ్డి రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు గణజాల తాతారావు, సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కోపూరి రత్నం, రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు లోత రామారావు, కోటంశెట్టి సత్తిబాబు, ముర్ల ఆనంద్, చెక్క పండు బాబు, సాగిన చిన్నమ్ములు, గంగిరెడ్ల బుజ్జి, కోట్లంక వీరబాబు, మాడం రాజబాబు, పి.వెంకన్నబాబు, నందా రాంబాబు, తహసిల్దార్ అల్లు సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లోకుల యాదగిరీశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారి కె.అబ్బాయిదొర, విఆర్వో వెంకటరెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular