పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రంపచోడవరం డివిజన్ పరిధిలోని రాజవొమ్మంగి నుండి రంపచోడవరం వయ భద్రాచలం 516 జాతీయ రహదారి పై అను నిత్యం అనేక రోడ్డు ప్రమాదాల సంభవిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామపంచాయతీ పరిధిలోని మడేరు వాగు ఆయకట్టు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారికి గేదెలు అడ్డు రావడంతో వాటిని ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చినబాబు హుటాహుటిన తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన వ్యక్తిని స్థానిక జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి 108 లో ఏలేశ్వరం ప్రభుత్వాసుప త్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని వారు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న చూపరులను కంటతడపెట్టించింది. ఏది ఏమైనా రోజురోజుకు జరుగుతున్న ఈ ప్రమాదాల పట్ల జాతీయ రహదారి విభాగం వారు తగు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరెన్నో ప్రమాదాలను చవిచూడాల్సి ఉంటుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
బర్రెలు రోడ్డుపై అడ్డు రావడంతో నిండు ప్రాణం బలి
RELATED ARTICLES
