Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరోడ్లపై పశువులను నిర్లక్ష్యంగా విడిచిపెడితే కఠిన చర్యలు సిఐ :గౌరీ శంకర్

రోడ్లపై పశువులను నిర్లక్ష్యంగా విడిచిపెడితే కఠిన చర్యలు సిఐ :గౌరీ శంకర్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రోడ్లపై పశువులను విడిచి పెట్టడం వల్ల, ప్రమాదాలు ముమ్మరంగా జరుగుతున్నాయని పశువుల యజమానులు, రైతులు పశువులను రోడ్లపై రాకుండా వాటిని ఆధీనంలో ఉంచుకోవాలని రాజువొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్ సోమవారం మీడియా సమావేశంలో ద్వారా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని రోడ్లపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయన్నారు. పశువులను రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని రైతులను కోరారు. కాదని రోడ్లమీద విడిచిపెట్టి ఉంచితే నిర్మొహమాటంగా గోశాలకు తరలిస్తామన్నారు. రోడ్లపై ఇష్టషారంగా తిరిగే పశువుల వల్ల అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ తెలిపారు. పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు కనిపించేలా బర్రెలకు రేడియం స్టిక్కర్లు అంటించాలని వాపోయారు. ఇకనుంచి అయినా పశువుల యజమానులు తీరు మార్చుకోవాలన్నారు. సర్లేకధ అని అంటీముట్ట నట్టు వ్యవహరిస్తూ.. గేదెలను గాని రోడ్డుపై వదిలిపెడితే వాటి యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు హాని జరుగుతున్న నేపథ్యంలోనే భద్రత దృష్ట్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular