
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం తామరపల్లిపంచాయతి కన్నారం ప్రభుత్వ పాఠశాలలో గురువారం తల్లితండ్రుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాని స్థానిక ఎంపీటీసీ కుంజం వంశి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పిల్లల విద్య,మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో పరిశీలించాలన్నారు, కమిటీలో ఉన్న సభ్యులు నామ మాత్రంగా ఉండడకూడదు అని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో కమిటీ ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూసించారు. పిల్లలు విద్యాభ్యాసం కాకుండా స్కూల్ ని అభివృద్ధి పరిచే భాగంగాలో అందరు సహాకారం అందించాలని కోరారు. గ్రామంలోని పాఠశాలల బిల్లిడింగ్ మంజూరై ఉందన్నది లేనిదే, గత మండల సర్వ సభ్య సమావేశంలో అడగగా మార్చి నెలలో మొదలు పెడుతున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలియజేసినట్లు సమావేశంలో ప్రస్తావించారు. విద్యార్థుల భోజనం విషయంలో ఎక్కడ లోపం ఉన్న ఉన్నత అధికారుల దృష్టిలో పెట్టడం జరుగుతుందని ఉపాధ్యాయుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ పద్మ,వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వికా వెంకన్న,కమిటీ మెంబెర్స్,గ్రామస్తులు తదితరులు పాలొగొన్నారు.
