
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలో భూగర్భ జలాలు వృధా కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. గురువారం రంపచోడవరం మండలం రంప గ్రామంలోని దొర వీధిలో చలమలు (స్ప్రింగ్ షెడ్)ను జాయింట్ కలెక్టర్ స్మరణ్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని మీ మీ గ్రామాలలో పూర్వం నుండి కాలువలలో చలమను నీటిని తాగే వారని అదేవిధంగా ఈ చలమలను దైవంగా భావించి చలమలకు దీపారాధన, పూజలు చేసి త్రాగునీరు తాగేవారని ఆయన అన్నారు. పూర్వ నుండి వచ్చే చలమ నీరు తగ్గినది లేనిది ఆయన ఆరా తీశారు. చలమల గురించి ఈ తరం యువతి యువకులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్ప్రింగ్ షేడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. భూగర్భ జలాలు వృధాగా పోకుండా వ్యవసాయానికి ఉపయోగించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ చలమల విధానం గిరిజన ప్రాంతంలోని ఆదివాసులు పూర్వం నుండి నీరు తాగేవారని ఈ విధానాన్ని కాపాడుకునే బాధ్యత గిరిజన ప్రాంత గిరిజనులపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపిడి టి. శ్రీనివాస్ విశ్వనాథ్, ఎంపీపీ శ్రీమతి బంధం శ్రీదేవి,ఎంపీడీవో ప్రసాద్, ఏపీవోలు బి.సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ వీరన్న, జేఈలు, ఏఈలు, పీసా కమిటీ సభ్యులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎఫ్ఏలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
