Thursday, April 16, 2026
HomeAndhra Pradeshరంపలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీపీ బందం శ్రీదేవి

రంపలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీపీ బందం శ్రీదేవి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంప శివాలయ ఆలయ ప్రాంగణంలో లోని ఈనెల 15న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లును రంపచోడవరం మండల ఎంపీపీ బందం శ్రీదేవి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రంప శివాలయ శివలయాన్ని సందర్శించి, ఆలయ కమిటీ సభ్యులను రంప కొండ మీద మహాశివరాత్రి నాడు జరగనున్న మహా శివరాత్రి ఏర్పాట్లు పై ఎంపీపీ అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలోనే అటవీశాఖ నేతృత్వంలో సీబిఇటీ వారి సమక్షంలో నిర్వహిస్తున్న, రంప జలపాతంకి వచ్చే పర్యాటకుల నుండి వసూలు చేసే రుసుములో శివరాత్రి జాతరకు 50% నిధులు, శివాలయ అభివృద్ధి మరియు సిబ్బంది జీతభత్యాల కోసం 50% నిధులు ఖర్చు పెట్టాలని గతంలో తీర్మానించుకోవడం జరిగినప్పటికీ, ఆ మేరకు అటవీశాఖ అధికారులు నిధులను విడుదల చేయకపోవడం వలన ప్రస్తుతం జాతర నిర్వహణ కష్టసాధ్యంగా ఉన్నదని ఎంపీపీ వద్ద జాతర కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీపీ శ్రీదేవి కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని రంప శివరాత్రి ఉత్సవాలకు ఉన్న గొప్పతనాన్ని మనమంతా కలిసి మరింత గొప్పగా ఈ జాతర మహోత్సవాల నిర్వహణకు అందరూ కోసం కృషిచేద్దామని ఆమె పేర్కొన్నారు.

Previous article
Next article
మాసిక వత్తిడి ఉరివేసుకుని చనిపోయన యువకుడు యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటనకు సంబంధించిన ఫిర్యాదు అందినది. అలుగోలు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అతని కుమారుడు అలుగోలు వీర వెంకట శివ నాగేశ్వరరావు (27 సంవత్సరాలు) యలమంచిలిలో నివాసం ఉంటూ వ్యక్తిగత కారణాలతో మానసిక వేదనకు గురై ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలియజేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే యలమంచిలి టౌన్ పోలీస్ వారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో లభించిన డైరీని కూడా స్వీకరించి దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాము.ప్రాథమిక విచారణలో, చిన్నప్పటి నుండి తనని పెంచి పెద్ద చేసిన తన మేనమామ మరియు పెద్దమ్మ చనిపోయారని, మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పిర్యాదు చెయ్యగా, డైరీలో కూడా అదే విషయాన్ని రాసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము స్టేషన్ హౌస్ ఆఫీసర్యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular