పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం ఊర్లకులపాడు గ్రామంలో అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను బుధవారం రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించి రోగులకు పండ్లు రొట్టెలు అందజేశారు, ఇటీవల కిడ్నీ వ్యాధితో తల్లి, భర్తను కోల్పోయిన గంగా భవానీకి తనవంతు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఇంటిలాపాదికి అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇదే క్రమంలో చెరుకుంపాలెం, గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబానికి కూడా ధనలక్ష్మి 5వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు, వట్టిగెడ్డ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆమె పరామర్శించారు, ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఊర్లకుల పాడులో మృత్యువాత పడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గతంలో చింతూరులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగిందని ఈసందర్భంగా ఆమె గుర్తు చేశారు. వ్యాధిగ్రస్తులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గోము వెంకటలక్ష్మి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, సింగిరెడ్డి రామకృష్ణ, అడపా కామేష్, ఆద్య రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఊర్లకులపాడులో మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పరామర్శ
RELATED ARTICLES
