విజయనగరం జిల్లావాణీ ప్రతినిధి: భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రిక్క నర్సయ్యమ్మ తనయుడు తోగులు రెడ్డి చిట్టివలస ప్రాంతంలో ప్రమాద వశాత్తూ విద్యుత్ ఘాతుకాని గురై గత 2025 సంవత్సరంలో మృతి చెందారు. ఈ విషయంపై బాధిత కుటుంబానికి చెందిన నరసయ్యమ్మ చెరుకుపల్లి గ్రామ పెద్దలు సహకారంతో హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామచైతన్యతో న్యాయం కోసం అభ్యర్ధించారు. ఈక్రమంలో మరణించిన బాధిత కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ యాక్ట్ 2017 సబ్ సెక్షన్ 2 ప్రకారంగా ఏపీ ఈపీడీసీఎల్ నుండి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు కొరకు సిఎండి పృద్వి తేజ్ దృష్టికి తీసుకొని వెళ్లి దరఖాస్తు చేశారు. అలాగే పెందుర్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గండి బాబ్జి దృష్టికి యువ న్యాయ వాది రామ చైతన్య మరియు చెరుకుపల్లి గ్రామ పెద్దలు పెద్ద రెడ్డి, గురుమూర్తి రెడ్డి, తాటిపూడి ఉదయ్ తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా బాధితురాలు రెక్క నరసింహ మాట్లాడుతూ మరణించిన నా కుమారునికి ఐదు లక్షల రూపాయలు విద్యుత్ సంస్థ నుండి మంజూరు చేపించిన సందర్భంగా గ్రామ పెద్దలకు, హైకోర్టు న్యాయవాది వై రామచైతన్యకు సహకరించిన చెరుకుపల్లి గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
విద్యుత్ ఘాతుకానికి గురై మృతు చెందిన కుటుంబానికి నష్టపరిహారం మంజూరు చేయించిన: న్యాయవాది రామ్ చైతన్య
RELATED ARTICLES
