Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతూన్నరు: మాజీ జడ్పీటీసీ...

ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతూన్నరు: మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జిచిన్నాలమ్మ

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజవోమ్మంగి మండలంలోని ఊర్లకులపాడులో
కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరామర్శకు వచ్చి, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి చేసిన ఆరోపణలు అర్థరహితం అని రాజవొమ్మంగీ మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో అందుబాటులో లేరని మాజీ జడ్పీటీసీ వాపోయారు. తమ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్న ప్పటికీ ఊర్లకులపాడు గ్రామంలోనీ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియాపర్చడంతో వెంటనే స్పందించి ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి 10రోజుల నుండి గ్రామంలోనే ప్రత్యేక వైద్య పరీక్ష కేంద్రాలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు చేసి వ్యాధిలు సోకడానికి గల కారణాలు గుర్తించాలని ఎమ్మెల్యే శిరీష దేవి డివిజనల్ వైద్య అధికారులను ఆదేశించడం జరిగిందనీ బుజ్జి చిన్నాలమ్మ వివరించారు. అదేవిదంగా
ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికార్లును గ్రౌండ్ లెవెల్ లోని ల్యాబ్ ద్వారా నీటిపరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ఉన్నా జామాయిల్ తోటల వల్ల ఏమైనా నీటి సాంద్రతలో ఏమైనా తేడాపాడాలు వస్తున్నాయేమో అని గ్రామ ప్రజల సందేహం మేరకు వెంటనే జామాయిల్ తోటలు తొలగించాలని చెప్పగా సంబందిత అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే శిరీష మాకు చెప్పారని అన్నారు. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామాన్ని సందర్శిస్తూ గ్రామాల్లోని పరిస్థితిని అధికారులతో, ఎమ్మెల్యే తో మాట్లాడుతూ సమీక్షిస్తున్నారనీ ఆమె అన్నారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమీషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి వచ్చి బాధితులను పరామర్శించి గ్రామంలో నిర్వహిస్తూన్న వైద్య ఆరోగ్య ప్రత్యేక పరీక్షల శిబిరాన్ని చైర్మన్ దగ్గరుండి పరిశీలించి త్వరితగతిన ప్రజలు గురవుతున్న ఆరోగ్య సమస్యలపై నిజ నిర్ధారణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి వెళ్లడం జారిందన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న పనులు మీ కంటికి కనిపించడం లేదా అని మాజీజడ్పీటీసీ ప్రశ్నించారు. గత 5సంవత్సరాలు మీరు
ఎమ్మెల్యేగా మీరూ చేశారు కదా..!ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియకపోవడం మీ అజ్ఞానానికి నిర్దర్శనమనీ బుజ్జి చిన్నాలమ్మ ఉద్ఘటించారు. ఇది సరేగాని ఇంతకీ మీ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏమైపోయ్యారు? ఆయన ఎక్కడికి వెళ్లి పోయారు? ప్రస్తుతం శాసనమండలి జరుగుతుంది ప్రస్తుతం అక్కడ ఉన్నారు కదా? అమ్మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాగ్రామంలో కిడ్నీ వ్యాధి తో చనిపోవడం బాధితులు ఉండడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ అనర్థాలు లేవని మీరు గ్రహించాలనీ హితావ్ పలికారు. ఏ సంవత్సరంలో ఎన్ని మరణాలు, కిడ్నీ వ్యాధితో చనిపోయారు? ఇతర వ్యాధులతో ఎంత మంది చనిపోయారు?ఒకసారి ఎమ్మెల్యే చేసిన మీరు సమగ్ర సమాచారం తెప్పించుకుని మాట్లాడితే బాగుండునేమోనని ఆమె అన్నారు! మేము అధికారంలో ఉన్న ఈ సమయంలో కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించు కుంటున్నవారికి వెంటనే 10000మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల పింఛన్లులో కూడా మీ ఆరోపణ నిజం కాదు.మీ వైసీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లు నగదు ఎంత? కిడ్నీ పేషెంట్లకు మీరు ఇచ్చిన పించన్ ఎమౌంట్ ఎంత? మా కూటమి ప్రభుత్వంలో మేము ఇస్తున్న పించన్లు నగదు ఎంత తేడాలు గమనించండి లేదా ప్రజల ముందే చర్చించండీ అని మాజీ జడ్పీటీసీ సలహా ఇచ్చారు. పూర్తి వివరం తెలియకుండా మీడియా ముందుకు వచ్చి మీఇష్టానికి ఏదేదో మాట్లాడితే ప్రజలు స్వాగతించారని బుజ్జి చిన్నాలమ్మ స్పష్టం చేశారు. మా ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మరియు కూటమి ప్రభుత్వం పై అర్ధంలేని విమర్శలు చేస్తే ప్రజాగ్రహానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు గ్రామంలోకి వచ్చి ఏదేదో మాట్లాడుతూన్నరే గత మీ ప్రభుత్వం హయాంలో మా ఊర్లకులపాడు గ్రామంలో కనీసం మారామాలయంకి నిధులు కూడా మీరు విడుదల చేయించలేకపో అర్ధాంతరంగా ఆగిపోయిన మా గ్రామం( ఉర్లాకులపాడు)మా ప్రక్క గ్రామం (బోర్నగూడెం) రామాలయల నిర్మాణం మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ ఎమ్మెల్యే శిరీష దేవి నిధులు విడుదల చేయించడం జరిగిందన్నారు. గత ఐదు ఏళ్ళ మీ వైసీపీ ప్రభుత్వం మరియు మీ వల్ల మా గ్రామానికి ఒరిగిందేమీ లేదని మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జిచిన్నాలమ్మ ఎద్దేవా చేశారు. కష్టకాలంలో బాధితులకు పరామర్శించి వెళ్ళాలి తప్ప అర్థ జ్ఞానంతో లేనిపోని విషయాలను తెరమీదకి తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మీ అవివేకాన్ని నిదర్శనం అని చిన్నాలమ్మ వాపోయారు. ఈ కార్యక్రమం లో ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకులు గణజాల తాతారావ్ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వాసంసెట్టి గంగాధర్ పీసా ప్రధాన కార్యదర్శి కోసూరి వీరబాబు మాజీ సర్పంచ్ కోసూరి గంగ టీడీపీ శ్రేణులు కంటపురెడ్డి వీరబాబు, కోసూరి మల్లిరెడ్డి కించి వెంకటరెడ్డి దోమాదుల వీరబాబు కోసూరి అప్పలరాజు రామిశెట్టి గంగ కోసూరి సోమరాజు కోసూరి లోవవీరవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular