పోలవరం జిల్లావాణి ప్రతినిధి: అమినాబాద్ పంచాయితీ జూనియర్ లైన్ మెన్ గ్రేడ్. 2 గా రెండేళ్ల పాటు పని చేసి గంగవరం మండలం నెల్లిపూడి ప్రాంతానికి బదిలీపై వెళ్లిన చారపు కన్నపురాజును ఏ. బి. కాలనీ కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. అమినాబాద్ సచివాలయంలో జరిగిన ఈసన్మానంలో కన్నపురాజుకు ఏ. బి. కాలనీ కూటమి నాయకులు పూలమాలలు వేసి శాలువాలను కప్పి సత్కరించారు. విద్యుత్ సమస్యలను వెంటనే తీర్చి ఎప్పటికప్పుడు సేవలను కన్నపురాజు అందించారని పోసిన వెంకన్నబాబు అన్నారు. ఈకార్యక్రమంలో గంగిరెడ్ల బుజ్జి, పోసిన వెంకన్నబాబు, మొండెం రాజబాబు, కోటిలింగ వీరబాబు, పోసిన తాతారావు, ఉగ్గిన సత్తిబాబు, యెజ్జు రాజు, తంగేటి రాంబాబు, పంచాయితీ కార్యదర్శి వెంకటేష్ సచివాలయ ఉద్యోగులు రామలక్ష్మి, బాపనమ్మ, వెంకటేష్, గంగాధర్, రాజు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ కు ఘనంగా సన్మానం
RELATED ARTICLES
